22.4 C
New York
Friday, September 17, 2021

వైఎస్ జగన్ – పవన్ ల గెరిల్లా వార్ ఫేర్

జగన్ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు కూడగట్టుకోవడం కాదని,  ప్రజలు కోల్పోయిన వాటిని అందచేయడమని ఆ పని జనసేన చేస్తుందని తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సమస్యను ఎత్తి చూపితే వ్యక్తిగత విమర్శలకు దిగడం తప్ప దాన్ని పరిష్కరిద్దామన్న ఆలోచన నేటి పాలకులు, అధికార పక్షంలో లేదని తాను కోరుకుంటున్న వర్క్ మైండెడ్ సభ్యులు ఎంత ఒత్తిడి తెచ్చినా నిలబడేవారై ఉండాలని తనకు జీవితంలో జీవితంలో పారిపోవడం తెలియదని, ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటానని, ఏదైనా అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ధైర్యంగా చెబుతానని అన్నారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్టు మాట మార్చేస్తూ ఉంటారని సీఎం స్థాయిలో ఉండి కరోనాని కట్టడి చేయలేక పధకాల పేరుతో ప్రజల ఆలోచనా విధానాన్ని డైవర్ట్ చేస్తే  ప్రజలు హర్షించరని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.  ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకునేలా ఉందన్నారు. ఆయన స్థాయికి తగిన మాటలు అవి కాదని జగన్ ఎంతటి శక్తివంతులో అందరికీ తెలుసు అని ఆయన ఒక లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణాల్లో బదిలీ అయిపోతారు అలాంటి ఒక పవర్ ఫుల్ నాయకుడు కరోనా మహమ్మారి ని కట్టడి చేసే విషయంలోనూ.. వ్యాక్సిన్ లను సకాలంలో ప్రజలకు అందుబాటులో వుంచడంలోనూ ఎందుకు ఫెయిలవుతున్నారు.?  ఇలాంటి పరిస్థితుల్లో మీతో గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సహకరిస్తారు .? అంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ నేపధ్యంలోనే కరోనా రోగులకు బెడ్స్ కొరత, ఆక్సిజన్ సిలిండర్ ల కొరత మొదలైన అంశాలను ప్రస్తావిస్తూ మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా అందిస్తున్న ఆక్సిజన్ బ్యాంకు సేవలను కొనియాడారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles